రైతు ఉద్యమకారిణిపై.. అత్యాచార*
Published on: Tue May 11, 2021 9:42AM
అది దేశ రాజధాని. కొత్త కాలంగా రైతుల హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఆ రైతులకు మద్దతుగా రాష్ట్రాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా తమ మద్దతు తెలుపుతున్నారు. ఒక బీజేపీ పార్టీ తొత్తులు తప్పా.. తాజాగా ఆ రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓ సామాజిక ఉద్యమకారిణి వెళ్ళింది. ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఎస్‌కేఎం ప్రకటన ప్రకారం, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువ ఉద్యమకారిణి(25), ‘కిసాన్ సోషల్ ఆర్మీ’కి చెందిన నలుగురు వ్యక్తులతో కలిసి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు హరియాణాలోని టిక్రీ సరిహద్దుకి బయలుదేరారు. ఏప్రిల్ 11న అక్కడి రైతుల నిరసనల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి దిల్లీకి బయలుదేరారు.
కట్ చేస్తే.. ఆ నలుగురు వ్యక్తులు మార్గంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ఉద్యమకారిణికి తీవ్ర జ్వరం, అస్వస్థతకు గురైయింది. ఆ బాధిత మహిళను దిల్లీలోని జగ్గార్ ఆసుపత్రిలో చేరారు. అదే క్రమంలో పరీక్షల్లో ఆమెకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 30న ఆసుపత్రిలో కన్నుమూసినట్లు సమాచారం. అయితే, యువతి చనిపోయే ముందు తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఆమె తండ్రికి ఫోన్‌లో తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హరియాణా పోలీసులు తెలిపారు. మూడు ప్రత్యేక బృందాల ద్వారా కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీస్ అధికారి విజయ్ కుమార్ వెల్లడించారు. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన యువతిపై అత్యాచరం జరిగినట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం), మహిళలపై ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రకటించింది.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే కిసాన్ సోషల్ ఆర్మీపై చర్యలు తీసుకున్నామని టీక్రీలోని రైతు సంఘం వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. టిక్రీ సరిహద్దులో కిసాన్ సోషల్ ఆర్మీకి చెందిన టెంట్లు తొలగించడంతో పాటు ఆ బృందానికి చెందిన వారిని ఉద్యమంలో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన తమ సహఉద్యమకారిణి పక్షాన న్యాయం కోసం పోరాడుతామని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది.
ఒక వైపు దేశంలో కరోనా విలయం. మరోవైపు దేశం మృత్యువు వలలో నిద్ర పోతుంది. అదే మృత్యువు వలతో ని నిద్ర లేస్తుంది. ఇలాంటి టైం లో కూడా అమ్మాయిలపై దాడులు మానడం లేదు. నమ్మి వెంట వచ్చిన వాళ్ళని నమ్మకద్రోహం తో చంపేస్తున్నారు కొంత మంది కామాంధులు.


