గాలి బెయిల్ పిటిషన్ పై నేడు తుది తీర్పు
Published on: Tue Jan 31, 2012 10:49AM
హైద
రాబాద్: ఓఎంసి కేసులో నిందితులు గాలి జనార్థన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డిల బెయిల్ పై నాంపల్లి సిబిఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. నిందితులు వేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఓఎంసి కేసుకు సంబంధించి సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసినందున బెయిల్ ఇవ్వాలని గాలి , శ్రీనివాస్ రెడ్డిలు న్యాయస్థానాన్ని వేడుకున్నారు. అయితే వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది.


