'గాలి'రిమాండ్ పొడిగింపు
Published on: Thu Jan 12, 2012 10:57AM
హైదరా
బాద్: ఓఎంసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్లకు న్యాయస్థానం ఈనెల 25వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. విచారణ నిమిత్తం వారిని సీబీఐ అధికారులు గురువారం చంచలగూడ జైలు నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ కేసులో సీబీఐ ఛార్జ్షీటు ప్రతులను న్యాయస్థానం గాలి జనార్ధనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు అందచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా 'మేము దేశం విడిచి పారిపోం... బెయిల్ మంజూరు చేయండంటూ' గాలి జనార్దనరెడ్డి న్యాయమూర్తి ఎదుట ప్రాధేయపడ్డారు. కాగా తనకు జైలులో ప్రత్యేక హోదా కల్పించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు.


