లొంగిపోయిన శ్రీలక్ష్మి ..చంచల్గూడ జైలుకు
Published on: Fri Jan 6, 2012 3:44PM
హైద
రాబాద్ : ఓఎంసీ కేసులో నిందితురాలు శ్రీలక్షి ఈరోజు నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ఆమెకు నాంపల్లి కోర్టు ఇచ్చిన బెయిల్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలనే సుప్రీం కోర్టు సమర్ధించినట్లు తెలిసింది. దాంతో ఈ నెల 6వ తేదీ లోపల నాంపల్లి కోర్టులో లొంగిపోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె ఈరోజు లొంగిపోయారు. ఆమెకు న్యాయస్థానం ఈనెల 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శ్రీలక్ష్మిని చంచల్గూడ జైలుకు తరలించారు.
ఇదిలా ఉండగా, జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై విచారణని కోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదావేసింది.


