TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గాలి బెయిల్పై సీబీఐ కౌంటర్ పిటిషన్

Published on: Fri Dec 30, 2011 11:35AM

హైదరాబాద్ : ఓఎంసీ కేసులో గాలి జనార్దనరెడ్డి రెండు రోజుల బెయిల్ పిటిషన్పై సీబీఐ శుక్రవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. తల్లి సంవత్సరీకం కోసం రెండు రోజుల ఎస్కార్ట్ బెయిల్ ఇవ్వాలని ఓఎంసీ డెరైక్టర్ గాలి జనార్దన్‌రెడ్డి నిన్న సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 31, జనవరి 1న రెండు రోజులపాటు ఎస్కార్ట్‌తో బళ్లారి వెళ్లేందుకు అనుమతించాలని ఆయన తన పిటిషన్లో కోరారు.