TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా బోణీ.. మను బాకర్‌కి కాంస్యం!

Published on: Sun Jul 28, 2024 5:55PM

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారిణి మను బాకర్ కాంస్య పతకంతో బోణీ కొట్టింది. 10 మీటరల్ ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో తొలి పతకం సాధించిన మహిళా క్రీడాకారిణిగా మను బాకర్ రికార్డ్ సృష్టించింది. ఫైనల్లో మను బాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ 243.2 పాయింట్లతో స్వర్ణం, కిమ్ యేజే 241.3 పాయింట్లతో రజతం గెలిచారు.