TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వృద్ధురాలు

Published on: Thu May 14, 2015 11:16AM

 

నల్గొండ జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా, సూర్యాపేటలోని శాంతినగర్ లో ఓ వృద్ధురాలు అభంశుభం తెలియని ఓ ఆరెళ్ల బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. వివరాలు.. పట్టణంలోని శాంతినగర్‌కాలనీలో బుధవారం అర్ధరాత్రి ఒక వృద్ధురాలు తన పక్కింటికి చెందిన సాయి మన్విత(6) అనే బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటల వల్ల బాగా గాయపడిన పాపను స్థానిక ఆస్పత్రికి తరలించారు కానీ.. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. పాప కుంటుంబ సభ్యులు ఆ వృద్ధురాలిపై ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వృద్ధురాలిని అదుపులోకి తీసుకున్నారు. కానీ వృద్ధురాలి బంధువులు మాత్రం ఆమెకు మతిస్థిమితం లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని తెలుపుతున్నారు.