TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బంగారం కోసం దారుణం!

Published on: Thu Jul 17, 2014 8:40PM

 

బంగారం కోసం దుండగులు దేనికైనా తెగిస్తున్నారు. హత్యలకు తెగబడుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో కొందరు దుండగులు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. వారి వద్ద నుంచి అయిదు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. పిల్లలు దగ్గర లేకపోవడంతో ఈ వృద్ధ దంపతులు కొంతకాలంగా ఒంటరిగా వుంటున్నారు. వృద్ధుల దగ్గర బంగారు ఆభరణాలు వున్నాయన్న విషయాన్ని కనిపెట్టిన ఎవరో తెలిసినవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.