TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళా జడ్జిని వేధించిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్..

Published on: Fri Jun 3, 2016 1:18PM


మహిళా న్యాయమూర్తిని వేధించిన క్యాబ్ డ్రైవర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోర్టుకు చెందిన మహిళా జడ్జి షాపింగ్‌కు వెళ్లడానికి ఓలా క్యాబ్‌లో ఎక్కగా డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. దీంతో ఆమె తీస్‌హజారీలోని కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు సందీప్‌ను గుడ్‌గావ్‌లో అరెస్ట్‌ చేశారు.  

 

షాపింగ్‌కు వెళ్లడానికి మే 28న ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నానని.. దారిలో ఓ షాప్‌కు వెళ్లివస్తానని కొంచెంసేపు వేచి ఉండమని డ్రైవర్‌కు చెప్పి లోపలికి వెళ్లానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రెండు నిమిషాలు దాటగానే డ్రైవర్‌ చాలా అసభ్యంగా తిడుతూ తన బ్యాగ్‌ రోడ్డుపై పడేశాడని తెలిపారు.