TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రంలో మండుతున్న వంట నూనెల ధరలు

Published on: Sat Mar 17, 2012 12:16PM

రాష్ట్రంలో వంటనూనెల ధరలు హఠాత్తుగా పెరిగాయి. దీంతో సామాన్య మానవులు, వ్యాపారులు విలవిలలాడుతున్నారు. వారం రోజుల క్రితం వరకు రూ. 80 ఉన్న వేరుశనగ కిలో ధర ఇప్పుడు రూ. 110కి చేరింది. సన్ ఫ్లవర్ నూనె ధర కిలో రూ. 70 నుంచి రూ. 90కి, పామాయిల్ ధర రూ. 60 నుంచి రూ. 75కు పెరిగింది. వంట నూనెలను ఎక్కువగా కర్నూల్, అనంతపురం, కాకినాడ ప్రాంతాల్లో తయారుచేస్తున్నారు. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో వేరుశనగ పంట తగ్గటంతో నూనె గింజలకు కొరత ఏర్పడి ధరలు పెరిగినట్లు వ్యాపారులు అంటున్నారు. గత నెల రోజుల నుంచి వేరుశనగ నూనె ధర పెరుగుతూ పోతోందని, దీనికి తోడు రకరకాల పన్నులు విధిస్తుండటంతో ధరను పెంచక తప్పలేదని వ్యాపారులు అంటున్నారు. కొత్త పంట వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.