TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉజ్జయిని మహంకాళి జాతర.. ప్రభుత్వంపై జోగినుల శాపనార్ధాలు.!

Published on: Mon Aug 3, 2026 10:20AM

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో జోగినుల ఆందోళన కలకలం రేపింది. జోగిని శ్యామల అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో   తోపులాట జరిగి ఆమె చేతిలోని బోనం కింద పడింది. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన జోగిని శ్యామల..   ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ ఘటనపై జోగినులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు. బోనం కింద పడటంతో జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెడుతూ తమ ఆవేదన  వ్యక్తం చేశారు.

జాతర సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు వచ్చిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై తీవ్ర  అసంతృప్తి వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదనీ, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని జోగినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనకు నిరసనగా జోగినులు తాము  తీసుకొచ్చిన బోనాలను కూడా ఆలయంలోకి తీసుకెళ్లకుండా ఆలయ ద్వారం వద్దే ఉంచి సమర్పించారు. ఈ సందర్భంగా జోగినులు తమకు జరిగిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జోగినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి   శాపనార్థాలు పెట్టారు.

ఆవేదనతో ఆలయ ద్వారం వద్దే కొంతసేపు నిరసన కొనసాగించారు. అనంతరం అమ్మవారి ఆలయం వైపు వెన్నుతిరిగి తమ నిరసనను వ్యక్తం చేశారు.జాతరలో భక్తుల రద్దీ మధ్య జోగినులు ఒక్కసారిగా ధర్నాకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Joginis hurl curses at the government, Jogini Syamala, Bonam, Felldown, Stampde, Ujjaini Mahankali Jathara