TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గర్భగుడిలోకి విజయసాయి రెడ్డి.. చంద్రబాబుకు మాత్రం గుడిలోకి నో ఎంట్రీ

Published on: Sat Jan 2, 2021 5:06PM

విజయనగరం జిల్లా రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. బిజెపి, వైసిపి, టిడిపి నాయకులు పోటాపోటీగా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ రామతీర్థం ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే ముందుగా విజయసాయిరెడ్డి కొండ పైకి ఎక్కారు. విజయసాయి ఆలయం వద్దకు వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ఆయనను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఆలయంలో ఆయన పూజలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత మాజీ సీఎం చంద్రబాబు కొండ పైకి ఎక్కారు. అయితే చంద్రబాబు గుడిలోకి వెళ్లకుండా అధికారులు తాళం వేశారు.

 

చంద్రబాబు మరికాసేపట్లో గుడి వద్దకు చేరుకుంటారనగా అధికారులు తాళం వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గుడికి తాళం వేయడంపై చంద్రబాబు అక్కడి ఆలయ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుడికి తాళం ఎందుకు వేశారని ప్రశ్నిస్తే... విచారణ జరుగుతోందని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విగ్రహాలను ఆయన గుడి వెలుపలి నుంచే పరిశీలించారు. దుండగులు రాముడి విగ్రహం తలను విసిరేసిన కోనేరును కూడా ఆయన పరిశీలించారు. ఇది ఇలాఉండగా చంద్రబాబును ఆలయంలోకి అనుమతి ఇవ్వక పోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిని ఏ హోదాతో అనుమతి ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు.