TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయ‌డానికి అనుమ‌తి!

Published on: Tue Apr 21, 2020 11:53AM

అమెరికాలో ఎప్పుడూ లేనంతగా ఆహార కొరతను ఆ దేశ ప్రజలు పలువురు ఎదుర్కొంటున్నారు. రోజువారీ జీవితంలో ఫుడ్ బ్యాంకుల వైపు కన్నెత్తి చూడని వారు సైతం.. ఇప్పుడు కిలోమీటర్ల కొద్దీ క్యూ బారుల్లో నిలుచుంటే.. తమకు అవకాశం వచ్చే వరకూ గంటల కొద్దీ వెయిట్ చేస్తున్నారు. కరోనాతో భారీగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా తొలి స్థానంలో నిలుస్తుందని చెప్పాలి. అగ్రరాజ్యంలోని అమెరికన్లకే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నవేళ.. ఆ దేశంలో ఉండే భారత విద్యార్థుల పరిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా వుంది. కరోనా నేప‌థ్యంలో  అమెరికాలో వున్న భారత విద్యార్థులు తీవ్ర‌మైన ఒత్తిడికి గురి అవుతున్నారు. 

పాత నిబంధనల్ని సడలిస్తూ అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పలు కొత్త సూచనలతో తాజాగా ప్రకటన విడుద‌ల చేసింది. ఆన్ క్యాంపస్ ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిప్పుడు ఆఫ్ క్యాంపస్ లో ఉద్యోగం చేసుకునేందుకు అప్లై చేసుకోవచ్చన్న వెసులుబాటు ఇచ్చారు. అయితే.. ఇందుకు కొన్నినిబంధనల్ని పాటించాలని పేర్కొన్నారు. ఆఫ్ క్యాంపస్ లో ఉద్యోగం చేయటం కోసం.. వర్సిటీ నుంచి అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది.   తాజా వెసులుబాటు తీసుకునే వారు కోర్సు పూర్తయ్యే కాలంలో ఏడాది పాటు ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయొచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంతో అమెరికాలో చిక్కుకున్న విదేశీ విద్యార్థులకు పెద్ద ఎత్తున మేలు చేస్తుందని చెబుతున్నారు.