TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇటాలియన్ల కిడ్నాప్ వెనుక ఆంధ్ర మావోయిస్టుల హస్తం

Published on: Thu Mar 29, 2012 10:39AM

ఒడిశాలో ఇటీవల మావోయిస్టులు ఇద్దరు ఇటాలియన్ జాతీయులను కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరిని విడుదలచేసి మరొకరిని తమ బందీగా ఉంచుకున్నారు. ఈ కిడ్నాప్ కు వ్యూహం రచించి నాయకత్వం వహించింది. మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టు దామల కృష్ణయ్య అని తెలిసింది. నల్లగొండ జిల్లాకు చెందిన దామల కృష్ణయ్య అయిదేళ్ళక్రితం ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయారు. 1990లో నక్సలైట్ ఉద్యమం పట్ల ఆకర్షితుడైన కృష్ణయ్య కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. అయితే ఉద్యోగంలో చేరకుండా నక్సల్స్ లో కలిసిపోయాడు. ఆలేరు దశ కమాండర్ గా ఎదిగి అనేక మెరుపుదాడులు చేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఒడిశాలోని కోరాపుట్, మల్కన్ గిరి, రాయగడ్, గంజాం, గణపతి జిల్లా అడవులపై ఆయనకు పూర్తి పట్టుంది. గతంలో వినీల్ కృష్ణ అనే ఐఎఎస్ అధికారి కిడ్నాప్ వ్యవహారంలో కూడా దామల కృష్ణయ్య హస్తం ఉందని రాష్ట్ర పోలీసులు అంటున్నారు.