TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గాలి బ్రదర్స్ రిమాండ్ పొడిగింపు

Published on: Wed Jan 25, 2012 1:41PM

హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి సీబీఐ కోర్టు ఫిబ్రవరి 8 వరకు రిమాండ్‌ పొడగించింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ తో పాటు ఎమ్మార్‌ కేసులో అరెస్టైన సునీల్‌ రెడ్డిని అధికారులు సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా శ్రీలక్ష్మికి కోర్టు ఫిబ్రవరి 8వ తేది వరకు రిమాండ్ పొడిగించింది. శ్రీలక్ష్మిని చంచల్ గూడ మహిళా జైలులో ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది. అటు ఎమ్మార్‌ కేసు ప్రధాన నిందితుడు కోనేర్‌ ప్రసాద్‌ రిమాండ్‌ గడువును కోర్టు ఫిబ్రవరి 2 వరకు పొడిగించింది.