తెలంగాణలో పాజిటివ్‌ల సంఖ్య 272కు పెరిగింది!

శ‌నివారంనాడు కొత్త‌గా 43 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.
దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది. 
ఇప్ప‌ట్టి వ‌ర‌కు 11 మంది చ‌నిపోయారు. అయితే చికిత్స పొంది,  క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డి 33 మంది ఇళ్ల‌కు వెళ్లారు. ఇంకా వివిధ ఆసుప‌త్రుల్లో 228 మంది చికిత్స పొందుతున్నారు.

ప్ర‌స్తుతం పాజిటివ్‌గా న‌మోద‌వుతున్న కేసుల‌న్నీ మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన వారు లేదా వారితో క‌లిసిన వారు మాత్ర‌మే. షాద్‌న‌గ‌ర్‌లో, సికింద్రాబాద్‌లో చ‌నిపోయిన వారు కూడా ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారితో క‌లిసిన‌వారేన‌ని తెలంగాణా ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 

ఢిల్లీ మ‌ర్క‌జ్ నుంచి 1090 మంది తెలంగాణాకు వ‌చ్చారు. వారంద‌రినీ కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాం. 6 ల్యాబ్‌లు 24 గంట‌ల పాటు ప‌నిచేస్తున్నాయి. ఎంత మందికి పాజిటివ్ వ‌చ్చినా చికిత్స అందించ‌డానికి అన్నీఏర్పాట్ల‌తో సిద్దంగా వున్నాం.

ఐదు ల‌క్ష‌ల ఎన్‌-95 మాస్కులు, ఐదు ల‌క్ష‌ల పిపిఇ కిట్లు, ఐదు ల‌క్ష‌ల వైర‌ల్ ట్రాన్మ్సిష‌న్ కిట్లు, 500 వెంటిలేట‌ర్లు, నాలుగు ల‌క్ష‌ల క‌రోన టెస్టింగ్ కిట్లు, 20 ల‌క్ష‌ల స‌ర్జిక‌ల్ మాస్కులు, 25 ల‌క్ష‌ల హ్యాండ్ గ్లౌసెస్ కొనుగోలు చేశాం. గ‌చ్చిబౌలీలో 1500 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి మ‌రో రెడు రోజుల్లో అందుబాటులోకి వ‌స్తుందని తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేంద్ర తెలిపారు.