Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నెంబర్ 18తో క్రికెట్ కింగ్ కోహ్లీ అనుబంధం
posted on: Jun 4, 2025 1:09PM

క్రికెట్లో రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీకి నెంబర్ 18 చాలా.. చాలా స్పెషల్. 18వ నెంబరుతో విరాట్‌కి ఉన్న అనుబంధం అపురూపమైంది. తాజాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ఆర్సీబీ ఐపీఎల్ కప్‌ను ముద్దాడింది. కోహ్లీ పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు జెర్సీ నెంబరు 18 కళ్ల ముందు కదలాడుతుంది. అది ఐపీఎల్ అయినా ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా కోహ్లీ ఆ జెర్సీ నెంబరుతోనే కనిపిస్తాడు. వాస్తవానికి అండర్ 19 క్రికెట్ ఆడేటప్పుడే కోహ్లీకి ఆ నెంబరుతో జెర్సీ ఇచ్చారు. ఆ తర్వత అది తన జీవితంతో ప్రత్యేకంగా మారిందని, రెండు ముఖ్యమైన క్షణాలు ఆ రోజునే జరిగాయని గతంలో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు.
కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది 18వ తేదీనే. 18 ఆగస్టు 2008లో తొలి వన్డే ఆడాడు. అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ 2006 డిసెంబరు 18న గుండెపోటుతో మరణించారు. కోహ్లీ తండ్రి కూడా క్రికెట్ ఆడే రోజుల్లో జెర్సీ నెంబరు 18నే వేసుకున్నారంట. ఆయన గుర్తుగా కింగ్ కూడా అదే నెంబరుతో కనిపిస్తున్నారు. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కోహ్లీ సెంచరీ నమోదు చేసింది 18వ తేదీనే. 2012 మార్చి 18న ఢాకాలో పాకిస్థాన్ పై జరిగిన వన్డేలో కోహ్లీ 183 పరుగులు చేశాడు. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్పు కల నెరవేరింది. 18వ సీజన్లో కప్పు దక్కించుకోవడంతో ఆ నెంబరు కోహ్లీకి మరింత ప్రత్యేకంగా మారింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలిచిన రోజు కూడా ఆ నెంబర్ మ్యాజిక్ కొనసాగడం విశేషం. 3-6-2025 కప్ గెలిచిన రోజు. అది టోటల్ చేస్తే వచ్చేది కూడా 18 కావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.


.webp)



