ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరిది బలవన్మరణం!
Published on: Mon Aug 1, 2022 5:30PM
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్.టి.రామారావు ఇంట విషాదం అలుముకుంది. ఆయన నాలుగవ కుమార్తె 52 ఏళ్ల ఉమామహేశ్వరి మరణించారు. ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. అనారోగ్య సమస్య లతో గత కొంతకాలం నుంచి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఆమె, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కంఠమనేని ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులు ఆ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల్లో ఉమా మహేశ్వరి అందరికంటే చిన్న. ఎన్టీఆర్ కు ఆమె పట్ల ప్రత్యేక ప్రేమా భిమానాలు ఉండేవి. తో డబుట్టిన అక్కలు, అన్నలూ ఆమె పట్ల ఎంతో అభిమానం చూపేవారు. గత డిసెం బర్ లోనే ఉమామహేశ్వరి చిన్న కుమార్తె వివాహం జరిగింది.
ఈ వివాహానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉమామహేశ్వరి మరణవార్త తో ఎన్టీఆర్ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. బాలకృష్ణ, చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఉమా మహేశ్వరి నివాసానికి చేరుకున్నారు


