TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా జీవితాంతం టిడిపికి సేవ చేస్తా: జూనియర్ ఎన్టీఆర్

Published on: Tue Jul 10, 2012 10:30AM

NTR TDP, JR NTR TDP, JR NTR KODALI NANI, KODALINANI JR NTRజూనియర్ ఎన్టీఆర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడాతు తాను బతికున్నంత కాలం టీడీపీతోనే ఉంటానని తెలిపారు.టీడీపీతో గానీ, నందమూరి కుటుంబంతో గానీ తనకెలాంటి గొడవలూ, మనస్పర్థలూ లేవని చెప్పారు. 28 ఏళ్లకే రాజకీయాల గురించి ఆలోచించేంత పరిస్థితి తనకు లేదని, కేవలం సినిమా ఒత్తిళ్ల వల్లే తాను పార్టీకి దూరంగా ఉన్నానని తనకు కుటుంబంతో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. సినిమా తాను నమ్ముకున్న వృత్తి కావడంతో ప్రస్తుతం అందులో ఉన్నానని, టీడీపీ తరఫున ప్రచారం చేయడం తన బాధ్యత అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలనే క్లారిటీ తనకు లేదని తెలిపారు. పార్టీలోకి యువత రావాలని, ఇప్పటితరానికి తమ సమస్యలేంటో తెలుసు కాబట్టి వారు ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలని చెప్పానన్నారు. పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా నా బాధ్యతను తీరుస్తానని మనవి చేస్తున్నా'' అని తెలిపారు.