TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో అన్నగారి విగ్రహం

Published on: Tue Dec 20, 2022 9:50AM

ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు వారి గుండె చప్పుడు, నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్. అయన మరణించి ఎన్నేళ్లు అవుతున్నా అయన సినిమాలు, ప్రజా సేవ ఆయనకు ప్రజల హృదయాలయాల్లోసుస్థిర స్థానం ఏర్పరిచాయి.  ఇప్పటికీ తెలుగు ప్రజలు ఆయనను తమ అభిమాన నాయకుడిగా గుండెల్లో గుడి కట్టిపూజిస్తున్నారు.  మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి.

అయితే అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఆయన విగ్రహం ఏర్పాటు కాబోతోంది.    అమెరికా న్యూజెర్సీలో ఎడిసన్ సిటీలో ఒక నిర్దేశిత ప్రాంతంలో ప్రపంచ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అక్కడి స్థానిక నాయకులు ముందుకొచ్చారు.

అక్కడ తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ తరపున ప్రముఖ నిర్మాత టిజి విశ్వప్రసాద్ అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ఎడిసన్ సిటీ మేయర్ కు ప్రతిపాదించారు. అందుకు ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. దీంతో 2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా  తెలుగు  వెలుగు నందమూరి తారక రామారావు  విగ్రహాన్ని అమెరికా న్యూ జెర్సీ ఎడిసన్ సిటీలో ప్రతిష్టించనున్నారు.