TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తండ్రి మరణం.. 250 ఎకరాలు అమ్మేసిన ఎన్టీఆర్.!!

Published on: Thu Aug 30, 2018 1:12PM

నల్గొండ సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే.. నాలుగేళ్ళ క్రితం హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా ఇలాగే రోడ్డు ప్రమాదంలో మరణించారు.. దీంతో నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు ఎందుకిలా వెంటాడుతున్నాయి అంటూ అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు కాదు ఎప్పటి నుండో నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి.

 

 

స్వర్గీయ ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి కూడా ఇలాగే రోడ్డు ప్రమాదంలో మరణించారు.. ఈ విషయాన్ని గతంలో హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.. ఆ ఇంటర్వ్యూలో సిటీలు నచ్చవని, తాత అంటే ఇష్టమని చెప్పారు.. 'నాన్న సినిమాలతో చెన్నై, హైదరాబాద్ తిరుగుతుండేవారు..నాబాల్యం మొత్తం నిమకూరులోనే గడిచింది.. చుట్టం చూపుగా మాత్రమే నాన్న వద్దకు చెన్నై, హైదరాబాద్ వెళ్ళేవాడిని.. నాకు సిటీలంటే చిరాకు.. అందుకే ఎప్పుడూ నిమ్మకూరులోనే ఉండేవాడిని.. నా ఇష్టాలకు అనుగుణంగానే తాతయ్య నన్ను నిమ్మకూరులోనే పెంచారు.. తల్లి తండ్రి నాకు అన్నీ తాతయ్యే.. నాన్న వద్దకు చెన్నై వెళ్లినా అక్కడ సిటీ వాతావరణం నాకు జైలుని తలపించేది.. ఎక్కువ రోజులు ఉండేవాడిని కాదు.. పల్లెటూరిలో పొలాలు, స్వచ్ఛమైన గాలి, నానమ్మ, తాతయ్య అనురాగం బాగా ఆస్వాదించేవాడిని.. 1976 లో నాన్నగారు హైదరాబాద్ లో రామకృష్ణ స్టూడియో కట్టడం ప్రారంభించారు.. అందువలన బలవంతంగా ఇక్కడకు రావలసి వచ్చింది.. మొదట రానని మొండికేశా.. నువ్వు ఇక్కడ అన్నీ చూసుకుంటావనే స్టూడియో కడుతున్నా.. నీకు తోడుగా తాతయ్య కూడా ఇక్కడికే వస్తారు అని నాన్నగారు చెప్పారు.. ఆ మాటతో అంగీకరించా.. తాతయ్య ఒకసారి శంషాబాద్ సమీపంలో ఉన్న మా పొలాలు చూసి వస్తున్నారు.. ఆ సమయంలో రాజేంద్ర నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతయ్య మరణించారు.. నా తండ్రి ప్రాణం తీసిన పొలం నాకు వద్దు అంటూ నాన్నగారు 250 ఎకరాలు ఉన్నపళంగా అమ్మేశారు' అని హరికృష్ణ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.