నాయక్ ఫస్ట్ షో చూడనున్న జూనియర్ ఎన్టీఆర్
Published on: Mon Jan 7, 2013 2:02PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "నాయక్" ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. నాయక్ ఫస్ట్ డే ఫస్ట్ షో ని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చూడబోతున్నారని సమాచారం. హైదరాబాద్ కాచిగూడ లోని పాత ధియేటర్లో ఒకటైన తారకరామ ధియేటర్ గత కొంత కాలంగా నవడటం లేదు. దాని స్థానంలో ఇప్పుడు కొత్త ధియేటర్ ను నిర్మించారు.
నాయక్ సినిమాతో ఈ ధియేటర్ పున:ప్రారంభం కానుంది. ఈ ధియేటర్ ప్రారంభానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరై రామ్ చరణ్ "నాయక్" ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. కొత్త ధియేటర్ ని ఆదునిక సౌకర్యాలతో నిర్మించారని...దీనిలో లేటెస్ట్ జేబిఎల్ సౌండ్ సిస్టం, లగ్జరీ సీటింగ్, మల్టీప్లెక్స్ సినిమా ఎక్స్పీరియన్స్, భారీగా పార్కింగ్ సౌకర్యం కలదు.


