ఎన్టీఆర్ పేరుపై నిర్ణయం అప్పుడే కాదు...
Published on: Thu Sep 4, 2014 6:05PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తెలుగు జాతి ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో పెంచిన ఎన్టీఆర్ పేరును రాజధానికి లేదా రాజధానిలోని అసెంబ్లీ ప్రాంతానికి పెట్టాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ పేరు గురించి అప్పుడు ఆలోచిద్దామని ఆయన తెలుగు తమ్ముళ్ళకు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే హైకోర్టు ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.


