'బాద్‌షా' ఎన్టీఆర్ ఫ్యాన్ మృతి: 10 లక్షల ఆర్ధిక సహాయం
Published on: Tue Mar 19, 2013 10:34AM

బాద్ షా’ ఆడియో వేడుకలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా మరో ఐదు లక్షలు అందించారు. ఈ మేరకు మృతుడు రాజు తల్లి ఈశ్వరమ్మతో స్వయంగా మాట్లాడి రూ.ఐదులక్షల చెక్కు అందించారు. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ బాబు తన వంతుగా నిన్నరాత్రి ఐదు లక్షలు ప్రకటించారు. మొత్తం 10 లక్షల చెక్కులు ఆమె తల్లికి అందించారు. పాత ఇనుప సామాను వ్యాపారం చేసే రాజు తండ్రి ఇటీవల మరణించాడు. దీంతో ఆ కుటుంబానికి రాజు ఆధారంగా ఉన్నాడు. అయితే అభిమాని మరణానికి సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్ తదితరులపై రాయదుర్గ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


