ఎన్టీఆర్ కుమార్తె మృతి
Published on: Mon Aug 1, 2022 4:06PM
నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్ టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమా మహే శ్వరి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో ఎన్‌టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయింది. ఆమె మరణ వార్త తెలుసుకున్న ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి చేరుకుంటు న్నా రు. ఇప్పటికే నారా లోకేష్ ఉమా మహేశ్వరీ ఇంటికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నారు. విదేశాల్లో ఉన్న ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇటీవలే ఆమె కూతురి వివాహం ఘనంగా జరిగింది.


