TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అభిమాని మృతిపై ఎన్టీఆర్ స్పందన

Published on: Mon May 6, 2019 1:10PM

 

జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులంటే చెప్పలేనంత అభిమానం. ప్రతి వేడుకలోనూ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్తుంటారు. కృష్ణా జిల్లాకు చెందిన అభిమాన సంఘం అధ్యక్షుడు జయదేవ్ సోమవారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

"నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్ర‌తినిధి జ‌య‌దేవ్ ఇక లేర‌న్న వార్త న‌న్ను తీవ్ర మ‌న‌స్థాపానికి గురి చేసింది. 'నిన్ను చూడాల‌ని' చిత్రంతో మొద‌లైన మా ప్ర‌యాణం ఇలా అర్థంత‌రంగా ముగిసిపోతుంద‌ని ఊహించ‌లేదు. న‌టుడిగా నేను చూసిన ఎత్తుప‌ల్లాల్లో నాకు వెన్నంటే ఉన్న‌ది నా అభిమానులు. ఆ అభిమానుల‌లో నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వ‌ర‌కు నాకు తోడుగా ఉన్న‌వారిలో జ‌య‌దేవ్ చాలా ముఖ్య‌మైన‌వారు. జ‌య‌దేవ్ లేని లోటు నాకు తీర‌నిది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను." అని పేర్కొన్నారు. జయదేవ్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.