TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాబు, జూనియర్ ఎన్టీఆర్‌ విభేదాలు, జగన్ ఆపరేషన్

Published on: Mon Apr 30, 2012 3:40PM

తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడికి, జూనియర్ ఎన్టీఆర్‌కి మధ్య నెలకొన్న విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. చంద్రబాబు వ్యతిరేక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు చకచకా ఆయన పావులు కదుపుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను వైయస్సార్ కాంగ్రెసు నాయకులు తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహరచన చేసి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీతో నడిరోడ్డు మీద చర్చలు జరపడంతో తెలుగుదేశం పార్టీలో కలవరం ప్రారంభమైంది. జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన వంశీతో పాటు గుడివాడ తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు కొడాలి నానిని కూడా జగన్ తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

 


జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చలు జరిపిన తర్వాత వంశీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురై వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు షోకాజ్ నోటీసుకు ఇచ్చిన వివరణలో జగన్‌పై కొన్ని సానుకూల వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీలో జగన్ పెట్టిన చిచ్చు వంశీ సంఘటనతోనే ప్రారంభం కాలేదని అంటున్నారు.  తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం జిల్లా గద్దె బాబూరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కూతురు కూతురు, అల్లుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.