జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయ్యారు
Published on: Tue Jul 22, 2014 1:07PM

ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) తండ్రి అయ్యారు. ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి ఈ రోజు ఉదయం 11 గంటలకు, బంజారాహిల్స్ రెయిన్బో హాస్పిటల్లో మగబిడ్డకు జన్మ ఇచ్చినట్లు సమాచారం.దీంతో జూనియర్ ఎన్.టి.ఆర్.కుటుంబంలోను,ఆయన అభిమానులలోను పండగ వాతావరణం నెలకొంది. నందమూరి వంశంలో మరో వంశాంకురం జన్మించడంతో జూనియర్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మీడియా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కు అభినందనలు తెలియచేస్తున్నారు.


