టిడిపి తరపున ప్రచారం చేస్తా: ఎన్టీఆర్

 

 

 

ఎన్టీఆర్ 18వ వర్ధంతి సంధర్బంగా ఆయన ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...టిడిపి పార్టీ తన రక్తంలో భాగమని..తన మద్దతు ఎప్పుడు పార్టీకి ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చె ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని తెలిపారు. తన బ్రతుకుదెరువు నటనేనని..తాత ఆశీస్సులతో పాటు తెలుగు ప్రజల ఆశీస్సులు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. టిడిపి తరపున ప్రచారం చేయడం తన బాధ్యతని ప్రకటించారు.