TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్టీఆర్ ఓ విశ్వ‌విద్యాల‌యం..జ‌య‌సుధ‌

Published on: Mon Aug 1, 2022 7:33AM

తెలుగు సినిమా అన‌గానే తెలుగువారంతా ఆరాధ్యంగా త‌ల‌చుకునే పేరు నంద‌మూరి తార‌క రామారావు. తెలుగువారు అత్యంత ప్రియుడు ఎన్టీఓడు. తెర‌మీద ఆయ‌న్ను చూడ‌కుండా ఉండ‌నివారుండ‌ర‌న‌డం అతిశ‌యోక్తి కాదు. న‌ట‌నాప‌రంగా, వ్య‌క్తిగానూ ఆయ‌న ప్ర‌త్యేక‌త ఇత‌రుల‌లో అంత‌గా క‌న‌ప‌డ‌దు. ఆయ‌నో ప్ర‌త్యేక‌మైన మ‌నిషి అంటారు అభిమానులు, కాదు భ‌గ‌వ‌త్ స్వ‌రూ పుడు అంటారు సినీ వీరాభిమానులు. అవును దేవ‌తారూపాల‌ను తెర‌మీద ప్ర‌ద‌ర్శించి వారు ప్ర‌త్య‌క్ష‌మ‌యితే ఇలానే ఉంటారేమో న‌న్నంత స‌మ్మోహ‌నం చేసిన న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్‌. సినీ, రాజ‌కీయ‌రంగాల్లో స‌మాంత‌రంగా విశ్వ‌ఖ్యాతి గాంచిన‌వారు ఎన్టీఆర్‌. 

సినీ న‌టునిగా, జాతీయ రాజ‌కీయాల్లో చెప్పుకోద‌గ్గ రాజ‌కీయ నాయ‌కునిగా అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నివ‌ర్గాల‌కు స‌మ‌న్యాయం చేస్తూ, తెలుగువారి కీర్తిని ఇనుమ‌డింప‌చేశారు. ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇవ్వా ల‌న్న డిమాండ్ మాత్రం ఇప్ప‌టికీ ఉంది. కేంద్రం ఈ విష‌యంలో జాప్యం చేస్తోంద‌ని అభిమానుల ఆగ్ర‌హానికి అర్ధం ఉంద‌ని విశ్లేష కులు అంటున్నారు. 

ఆయ‌న్ను చూసి ఎన్నో విష‌యాలు ముఖ్యంగా క్ర‌మ‌శిక్ష‌ణ‌, పెద్ద‌ల‌ను గౌర‌వించ‌డం, తెలుగును గౌర‌వించ‌డం అనేది ఎంద‌రో  రాజ‌కీయ‌నాయ‌కులు, అన్ని రంగాల్లో ప‌నిచేసేవారిదీ ఇదే మాట‌. అంటూంటారు. అది ఎంతో స‌త్య‌మ‌ని అన్నారు సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ‌. ఆయ‌న్ను విశ్వ‌విద్యాల‌యంతో పోల్చారామె.

గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ శతాబ్ది ఉత్సవాల్లో  జయ సుధకు ఎన్టీఆర్‌ శతాబ్ది పురస్కారం ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో నటించడం నటీనటులకు అదృష్టమని, ఎంత గొప్ప స్థాయికి చేరినా ప్రతి ఒక్కరినీ గారు అని సంబోధించడం ఆయన విజ్ఞతకు నిదర్శన మని చెప్పారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, ఎన్టీఆర్‌ తనయుడు నంద మూరి మోహనకృష్ణ, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు