బాబు భద్రతా విధుల్లో కళ్లు తిరిగిపడిపోయిన ఎన్ఎస్ జీ కమెండో
Published on: Mon Apr 20, 2026 1:18PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు అకస్మాత్తుగా కళ్లుతిరిగి పడిపోయిన సంఘటన కలకలం సృష్టించింది. తన పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు విజయవాడ పటమల లోని అన్న క్యాంటిన్ లో అల్పాహారం చేశారు. ఆ సందర్భంగా అక్కడ ప్రజలతో ముచ్చటించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతుండగా, చంద్రబాబు పక్కనే నిలబడి విధులు నిర్వహిస్తున్న ఒక ఎన్ఎస్‌జీ కమాండోకు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు.
అప్రమత్తమైన ఇతర సిబ్బంది ఆయనను పక్కకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేశారు. చంద్రబాబు కూడా ప్రసంగాన్ని ఆపి , కమాండో పరిస్థితిని గమనించి ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎండ తీవ్రత కారణంగా ఆ కమెండోకు కళ్లు తిరిగి ఉండొచ్చని ప్రథమికంగా భావిస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం కళ్లు తిరిగి పడిపోయిన కమెండో ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నారనీ, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


