FedEx సీఈవోగా NRI.. టాప్ కంపెనీల్లో మనోళ్ల హవా..
Published on: Tue Mar 29, 2022 5:45PM
ప్రముఖ కొరియర్ డెలివరీ సంస్థ ఫెడెక్స్ కు.. భారతీయ అమెరికన్ రాజ్ సుబ్రమణియం సీఈఓ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హోదాలో ఆయన పనిచేస్తున్నారు. ఫెడెక్స్ సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాల్లో రాజ్ సుబ్రమణియంకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రాజ్ అనే కాదు.. పలువురు భారత సంతతి వ్యక్తులు అమెరికాలోని పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలకు సీఈవోలుగా ఉన్నారు. వారిలో కొందరు....
>>సుందర్ పిచాయ్ - గూగుల్, ఆల్ఫాబెట్
>>సత్య నాదెళ్ల - మైక్రోసాఫ్ట్
>>అర్వింద్ కృష్ణ - ఐబీఎం
>>పరాగ్ అగర్వాల్ - ట్విటర్
>>శంతను నారాయణ్ - అడోబ్
>>లీనా నాయర్ - ఛానెల్
>>సంజయ్ మెహ్రోత్రా - మైక్రాన్
>>నికేశ్ అరోరా - పాలో ఆల్టో నెట్‌వర్క్స్
>>జార్జ్ కురియన్ - నెట్‌యాప్
>>రేవతి అద్వైతి - ఫ్లెక్స్ (ఫ్లెక్సాట్రానిక్స్)
>>అంజలి సుద్ - విమియో
>>జయశ్రీ ఉల్లాల్ - అరిస్టా నెట్‌వర్క్స్
>>రంగరాజన్ రఘురామ్ - వీఎంవేర్


