TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మేడారంలో... విద్యుత్ వెలుగులు

Published on: Thu Jan 29, 2026 8:42AM

విద్యుత్ వెలుగులలో మేడారం మహాజాతర మెరిసిపోతున్నది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఎన్పీడీసీఎల్ కళ్లు మిరుమిట్లు గొలిపేలా మేడారం జాతరకు ఏర్పాట్లు చేసింది. క్షణం పాటు కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా అధికారులు, ఆపరేషన్, మెయింటెయినెన్స్ సిబ్బంది రౌండ్ దీ క్లాక్ విధులు నిర్వహిస్తున్నారు.

   ఇద్దరు డైరెక్టర్లు టి.మధుసూదన్, వి.మోహన్ రావు. చీప్ ఇంజనీర్లు కె. రాజు చౌహన్, ఆశోక్ పర్యవేక్షణలో నలుగురు సూపరిండెంట్ ఇంజనీర్లు, ఏడుగురు డివిజన్ ఇంజనీర్లు, 30 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు 150 నుంది. 500 మంది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు మూడు  బ్యాచ్ లుగా బ్యాచ్ కు 30 మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. 

సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో లైన్ పెట్రోలింగ్ చేస్తూ లోపాలను గుర్తిస్తూ సరిచేస్తున్నారు. రాత్రి, పగలు లేకుండా   కష్టపడుతూ విధులు నిర్వర్తిస్తూ భక్తులకు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు .