TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్వామి స్వరూపానంద భూ కబ్జాపై నోటీసులు

Published on: Mon Mar 24, 2025 3:05PM

జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అందులో బాగంగానే జగన్ కు రాజగురువుగా గుర్తింపు పొందిన స్వరూపానందకు నోటీసులు జారీ అయ్యాయి. స్వరూపానంద స్వామికి చెందిన   ఆశ్రమంలో ఇరవై రెండు సెంట్ల   ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లుగా తేల్చిన అధికారులు ఆ స్థలంలో నిర్మించిన కట్టడాలను తొలగిం చాలని నోటీసులు జారీ చేశారు.  

తొలుత చినముషిడి వాడలో శారదాపీఠం పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. జగన్ హయాంలో ఈ కబ్జాకు సంబంధించి ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. దీంతో దాదాపు 15 వందల గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోంది. నోటీసులు జారీ చేసినప్పటికీ స్వరాపానంద విశాఖలో అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడీ నిర్మాణాలు తొలగిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.