TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అషు రెడ్డి, ఆమె తల్లిదండ్రులకు నోటీసులు

Published on: Fri May 8, 2026 2:42PM

అషు రెడ్డి కు సంబంధించిన కేసు తెలంగాణలో మరో సారి సంచలనంగా మారింది. ప్రేమ పెళ్లి పేరుతో భారీగా డబ్బులు కాజేశారన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లోని  సిసిఎస్ పోలీసులు నటి అషు రెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా సీఆర్పీసీ 41ల నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. 

అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి   ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.

పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్  రద్దు చేయాలని కోరుతూ  అషు రెడ్డి  హైకోర్టును ఆశ్రయించారు. అ దేవిధంగా పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కూడా కోరారు.  ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు..   పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఈ కేసులో ప్రభుత్వానికి, పోలీసులకు కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో  పోలీసలు  దర్యాప్తు  వేగం పెంచారు. ఈ నేపథ్యంలోనే అషురెడ్డి, ఆమె తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశారు.