హాలీడే కాదు.. ఓటింగ్ డే.. ఎమ్మెల్సీ కవిత
Published on: Thu Nov 30, 2023 7:50AM
యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు నియోగించుకోవాలని తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
ఈ రోజు సెలవు కాదనీ, ఓటింగ్ డే అనీ అన్నారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే అందరూ ఓటేయాలని కవిత పేర్కొన్నారు. ఈ ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు.
2018లో బీఆర్ఎస్ కు మద్దతిచ్చినట్లే ఈసారీ జనం తమనే గెలిపిస్తారన్న విశ్వాసాన్ని కవిత వ్యక్తం చేశారు. ప్రజల ప్రేమాభిమానాలు కేసీఆర్ వైపే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.


