అబ్బాయిని కాదు అమ్మాయిని.. ఎలాన్ మస్క్ తండ్రి కాదన్న కొడుకు

posted on: Jun 21, 2022 3:17PM

కుటుంబ వ్య‌వ‌స్థ‌లోనే ఏదో మ్యాజిక్ వుందంటారు పెద్ద‌లు. ఎంత ఎదిగినా, ఎంత వృత్తి, ఉద్యోగాల‌తో అభి వృద్ధి సాధించినా, ఏ దేశ‌మేగినా.. పిల్ల‌లు తమ త‌ల్లిదండ్రుల పేరుతోనే లోకానికి తెలియాల‌ని అలానే చ‌లామ‌ణీ అవుతుంటారు. అదో గొప్ప బంధం. కానీ  ఎలాన్ మ‌స్క్ కొడుకు గ్జావియ‌ర్ అలెగ్జాండ‌ర్ మ‌స్క్ విష‌యం వేరు.   ఎందుకంటే అత‌ను వేరే! అత‌నికి తండ్రి పేరు త‌గిలంచుకోవడం ఇష్టం లేదు.  విష‌య‌మేమంటే, ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా(  కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కొడుకు 18 ఏళ్ల గ్జావియ‌ర్ ట్రాన్స్ జెండ‌ర్‌. త‌న‌ను అబ్బాయిగా కాకుండా అమ్మాయిగా గుర్తించాల‌ని, అస‌లు త‌న తండ్రి సంబంధం వ‌ద్ద‌నీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు.  

తన తండ్రి(బయోలాజికల్) ఎలాన్ మస్క్‌తో  ఏ రూపంలోనూ బంధాన్ని కోరుకోవడంలేదని, తండ్రి గుర్తింపు అక్కర్లేదని, అందుకే పేరులో మార్పులు చేసు కుంటున్నట్టు గ్జావియర్ తెలిపాడు. తన తండ్రి పేరుతో జీవించేందుకు ఇష్టం లేదని వివరించాడు. టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ 2000 సంవ‌త్స‌రంలో కెన‌డా న‌టి జ‌స్టిన్ విల్స‌న్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఎని మిదేళ్ల త‌ర్వాత  ఇద్ద‌రూ విడిపోయారు. అయితే  వీరిద్ద‌రికీ ఆరుగురు సంతానం. ఐవీఎఫ్ ద్వారా  జ‌స్టిన్ ఇద్ద‌రు  క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. విడాకుల అనంత‌రం త‌ల్లిదండ్రులిద్ద‌రూ  పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌ను చూసు కుంటున్నారు. ఆ క‌వ‌ల‌ల్లో ఒక‌డే ఈ అలెగ్జాండ‌ర్ మ‌స్క్! ఇత‌ను అమ్మాయిగా మారి వివియ‌న్  జెన్నా విల్స‌న్ అని పేరు మార్చ‌కోవ‌డానికి కూడా కోర్టును అనుమ‌తి కోరాడు.

త‌న‌కు మ‌స్క్‌తో ఏమాత్రం సంబం ధం క‌లిగి వుండ‌డం ఇష్టంలేద‌ని అన్నాడు. అందువ‌ల్ల త‌న త‌ల్లి పేరు వుండేట్టు పేరు మార్చుకున్నానని,  త‌న తండ్రితో గుర్తింపు స‌సెమీరా కోరుకోవ‌డం లేద‌న్నాడు. త‌న‌ను అమ్మాయిగానే గుర్తించాల‌ని అలె గ్జాండ‌ర్  లాస్ ఏంజిల్స్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టులో దాఖ‌లు చేసిన  పిటిష‌న్‌లో కోరాడు.  పేరు మార్పిడికి అనుమతిచ్చి తన లింగ మార్పిడికి  చట్టబద్ధత  కల్పించాలంటూ లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అమెరికా ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల హక్కులపై విధించిన పరిమితులకు ఎలాన్ మస్క్‌ మద్దతు తెలిపాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగడంతోనే వివియన్ పిటి షన్ దాఖలు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...