TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉత్తర కొరియా.. అణు సామర్థ్య ప్రదర్శన.!

Published on: Mon Jul 6, 2026 8:39AM

ఉత్తర కొరియా తన అణు సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఇందుకోసం ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా రంగంలోకి దిగారు.  ఇటీవల మరమ్మతులు పూర్తి చేసుకున్న శక్తివంతమైన 5,000 టన్నుల బహుళార్ధసాధక డిస్ట్రాయర్  యుద్ధనౌక   కాంగ్ కోన్ పై నిర్వహించిన సమగ్ర లైవ్-ఫైర్ ఆయుధాల పరీక్షలను  పర్యవేక్షించారు. ఇందుకు సంబధించిన వివరాలను ఉత్తర కొరియా ప్రభుత్వం అధికారికంగా వెళ్లడించింది. 

ఈ కీలక సైనిక విన్యాసాలలో  సదరు యుద్ధనౌక నుంచి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. దీంతో పాటు ఈ యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.  కాంగ్ కోన్ వార్ షిప్   శత్రువులతో పోరాడేందుకు పూర్తి స్థాయిలో  సిద్ధంగా ఉందని కిమ్ ప్రకటించారు. అలాగే రానున్న రెండు మూడు నెలల్లో  ఈ భారీ యుద్ధనౌకను పూర్తిస్థాయిలో నావికాదళ విధుల్లోకి చేర్చాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.  
 North Korea warship, Kim Jong Un orders, Kang Kon destroyer, strategic cruise missile, Teluguone