కొరియా సరిహద్దుల్లో టెన్షన్..టెన్షన్

వరుస అణుపరీక్షలతో ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తూ..అమెరికా హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయకుండా కయ్యానికి కాలుదువ్వుతోంది ఉత్తరకొరియా. అయితే తమ సహనాన్ని పరీక్షించోద్దని..సంయమనంతో వ్యవహరించాలని అమెరికా పదే పదే కోరుతున్నప్పటికీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో కొరియా సరిహద్దుల్లో అమెరికా యుద్ధ విమానాలను మొహరించింది. నిన్న రాత్రి అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు ఉత్తర కొరియా సరిహద్దులకు అతి సమీపం నుంచి ప్రయాణించాయి. దీనిపై ఉత్తరకొరియా స్పందించింది..ట్రంప్ ఆత్మహత్యా ప్రయత్నాల్లో ఉన్నారని..తమ క్షిపణులు అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకుతాయని ఆయన హెచ్చరించారు.