వాటీస్ దిస్ నాన్సెన్స్?


 

మమ్మీ..మమ్మీ వాళ్ళు నన్ను మళ్ళీ నాన్సెన్స్ అనమంటునారు...

 

ఎవరురా?

 

అదే సీమంద్రా వాళ్ళు మమ్మీ

 

మళ్ళీ దేనికిరా?

 

అదే మమ్మీ మొన్న మన్మోహన్ అంకుల్ వాళ్ళు ఏదో టీ-నోట్ పాస్ చేసారట కదా! దానిని కూడా ఓసారి నాన్సెన్స్ అనమని సీమంద్రా వాళ్ళు ఒకటే బ్రతిమాలుతున్నారు మమ్మీ. పోనీ ఓసారి దాన్నికూడా నాన్సెన్స్ అనేయమంటావా? వాళ్ళు కూడా మనల్నిమెచ్చుకొంటారు...

 

మొన్నే కదరా మనవాళ్ళు చేసిన ఆర్డినెన్స్ ని నువ్వు నాన్సెన్స్ అని మన పరువు తీసావు...ఇంకా మన పరువేమయినా మిగిలుంటే దానిని కూడా తీసేద్దామనా? నాన్సెన్స్...మళ్ళీ నాన్సెన్స్ అన్నావంటే ఈ సారి ఊరుకొనేది లేదు..జాగ్రత్త!

 

నాన్సెన్స్! మన వాళ్ళు అందరూ నన్ను తెగ మెచ్చుకొంటుంటే నువొక్కదానివే ఇలా అంటున్నావు మమ్మీ. రియల్లీ ఇటీజ్ నాన్సెన్స్ మమ్మీ.

 

అవునురా నాన్సేన్సే... మనవాళ్ళు నేను చెప్పినట్లు నీకు చెక్కభజన భజన చేసారు గాబట్టి బ్రతికిపోయావు లేకుంటే ఆ మోడీ అంకుల్ చేతిలో నీ పనయిపోయేది తెలుసా? నువ్వు గొప్ప అవినీతి వ్యతిరేఖివని అందుకే నాన్సెన్స్ అనగలిగావని మనవాళ్ళు నిన్ను వెనకేసుకు వచ్చేసరికి వాళ్ళ తల ప్రాణం తోక్కి వచ్చింది తెలుసా? నీ నాన్సెన్స్ వల్ల పాపం మన్మోహన్ అంకుల్ ఎంత బాధ పడ్డారో తెలుసా? ఆయనని సముదాయించలేక చచ్చేను తెలుసా? నువ్వీసారి నాన్సెన్స్ అంటే నేనా టీ-నోట్ వెనక్కి తీసుకోమని చెప్పలేను కూడా.

 

పోనీ సీమంధ్ర ఉద్యమాన్ని నాన్సెన్స్ అనమంటావా మమ్మీ? కేసీఆర్ అంకుల్ మనల్ని బాగా మెచ్చుకొంటారు కదా...?

 

అప్పుడు గానీ మనకి బుద్ది రాదు. ఆ మాటన్నావంటే వాళ్ళు మనల్ని, మన పార్టీని మళ్ళీ ఆ రాష్ట్రంలో కాళ్ళు కూడా పెట్టనీయరు.. గుర్తుంచుకో...

 

నేను అనకపోయినా సీమంద్రా వాళ్ళు ఈ సారి కాంగ్రెస్ వాళ్ళని కాలుపెట్టనీయరని మన లగడపాటి, దివాకర్ అంకుల్స్ అందరూ చెపుతున్నారు కదా?

 

నాన్సెన్స్! వాళ్ళు అలా అంటున్నారనే నేను వేరే ఏర్పాటు చేసాను. మనకేమి డోకా లేదక్కడ.. నువ్వు మాత్రం ఇంక ఎవరు వచ్చి ఎంత బ్రతిమాలినా నాన్సెన్స్ అని మాత్రం అనకు.. గుర్తుంచుకో...

 

నువెప్పుడు ఇంతే మమ్మీ..నన్నేమి మాట్లాడొద్దంటావు. నేనేమి మాట్లాడినా నాన్సెన్స్ అని తీసి పారేస్తావు! నాన్సెన్స్!

 

నిన్ను మాట్లాడనీయకపోవడం ఏమిటి? నువ్వు దేశం..సుపరిపాలన..అధికార వికేంద్రీకరణ...అభివృద్ధి...ప్రజలు..త్యాగాలు...అంటూ మాట్లాడినప్పుడు మన వాళ్ళందరిచేతా నీకు ఎవరు చెక్క భజన చేయించారనుకొన్నావు? నువ్వు అలాంటి టాపిక్ ఎంతసేపయినా మాట్లాడుకో నాకేమి అభ్యంతరం లేదు. కానీ నీ ఉపన్యాసంలో ఎక్కడా నాన్సెన్స్ అనే పదం మాత్రం వాడకూడదు. గుర్తుంచుకో...

 

అలాగే మమ్మీ! కానీ ప్రజలు మాత్రం నా ఉపన్యాసాలు ఎంత కాలం వింటారు? ఏదో ఒకరోజు వాళ్ళు కూడా నాన్సెన్స్ అంటారేమో మమ్మీ?

 

మరేం పర్వలేదురా..మనకీ చెక్కభజన బృందం ఉన్నంత కాలం నువ్వు ప్రజలేమనుకొంటారోనని ఆలోచించనవసరం లేదు.

 

థాంక్స్ మమ్మీ మన వాళ్ళని ఇంత బాగా ట్రయిన్ చేసినందుకు...యువ్వార్ రియల్లీ గ్రేట్ మమ్మీ!

 

అద్సరే గానీ.. మరో విషయం బాగా జ్ఞాపకం ఉంచుకో..మనం దేశం కోసం ప్రజలని త్యాగాలు చేయమని చెపుతుండాలి గానీ, మనం త్యాగాలు చేస్తామని నోరు జారకూడదు..నువ్వు ఇవ్వాళ్ళ కాకపోతే రేపయినా ఆపెద్ద కుర్చీలో కూర్చొంటే, మన వాళ్ళు అందరూ నీ ఎదురుగా చేతులు కట్టుకొని నీకు భజన చేస్తుంటే చూసి ఆనందించాలని ఈ తల్లి మనసు ఆరాటపడుతోంది...అందుకే నాకా కుర్చీ వద్దని మాత్రం ఎప్పుడు ఎక్కడా నోరు జారకు గుర్తుంచుకో...

 

ఒకే గాటిట్ మమ్మీ.

 

ఈ రోజు కాలేజీ పిల్లలకి దేశసేవ గురించి లెక్చర్ ప్రోగ్రాం ఒకటుంది. ఎనీ అబ్జక్షన్స్?

 

నో..నాటెటాల్ మై సన్ క్యారీ ఆన్...పనిలో పనిగా ఆ పక్కనే ఉన్నఎలిమెంటరీ స్కూలు పిల్లలకి కూడా నాలుగు మంచి ముక్కలు చెప్పిరా...

 

ష్యూర్ మమ్మీ..ఒకే.. సీయూ బై...