పోక్సో కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
Published on: Sat Jan 17, 2026 11:24AM
.webp)
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడలోని పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గోరంట్ల మాధవ్ పై గతంలో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అత్యాచారానికి గురైన బాలిక వివరాలను బహిర్గతం చేశారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై గోరంట్ల మాధవ్ పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా గోరంట్ల మాధవ్ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇలా ఉండగా తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రీకాల్ చేయాలని కోరుతూ గోరంట్ల మాధవ్ సోమవారం (జనవరి 19) కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.


