TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

Published on: Fri Mar 3, 2023 3:16PM

రాష్ట్రపరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గతంలో రైల్ రోకో లో పాల్గొన్న సందర్భంగా ఆయనపై నమోదైన ఒక కేసుకు సంబంధించి ఈ వారెంట్ జారీ అయ్యింది.  

2018లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ డిమాండ్ తో చేపట్టిన రైల్ రోకో కార్యక్రమంలో అప్పటికి విపక్షంలో ఉన్న గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన అక్రమంగా రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించి విశాఖ, పలాస ప్యాసంజర్ రైలును నిలిపివేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఆయనపై కేసు నమోదైంది.

అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన గత నెల 27న కోర్టులో హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. దీంతో రైల్వే న్యాయస్థానం గుడివాడ అమర్నాథ్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‎నాథ్ కు విశాఖ  రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.  రైల్వే స్టేషన్‎లోకి అనధికారికంగా ప్రవేశించారని ఐదేళ్ల కిందట ఆయనపై నమోదైన కేసులో కోర్టు ఈ వారంట్ జారీ చేసింది.  2018లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్‎లోకి ప్రవేశించి విశాఖ-పలాస ప్యాసింజర్ రైలును నిలిపేసి రైల్‌రోకో నిర్వహించారు. దీంతో గుడివాడ అమర్ తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో గత నెల 27న న్యాయ స్థానంలో హాజరు  కావాల్సి ఉండగా హాజరు కాకపోవడంతో  నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.