టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా!
Published on: Fri Oct 11, 2024 2:43PM

ఇప్పటి వరకు రతన్ టాటా ఛైర్మన్‌గా వున్న టాటా ట్రస్ట్స్ బాధ్యతలను నోయెల్ టాటాకు ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా అప్పగించినట్టు తెలుస్తోంది. రతన్ టాటా కన్నుమూసే వరకు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు. అలాగే ఐదు ట్రస్టులు కలసి వున్న టాటా ట్రస్ట్స్.కి కూడా ఛైర్మన్‌గా వున్నారు. ఈ ఐదు ట్రస్టులలో కీలకమైనవి, ఎక్కువ వాటాలు వున్నవి సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్. మరొకటి సర్ రతన్ టాటా ట్రస్ట్. ఈ రెండు ట్రస్టులకే కంపెనీలో 52 శాతం వాటాలు వున్నాయి. మొత్తం ఐదు ట్రస్టులకు కలిపి కంపెనీలో 67 శాతం వాటాలు వున్నాయి. ఇప్పుడు ఆ ట్రస్ట్స్ మొత్తానికి నోయెల్ టాటా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే హోల్డింగ్ కంపెనీ బాధ్యతలను టాటా సన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టాటా సన్స్.కి చంద్రశేఖరన్ ఛైర్మన్‌గా వున్నారు. టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్‌ని నియమించే విషయంలో 13 మంది ట్రస్టీలు ఏకాభిప్రాయం తీసుకున్నారు. వారంతా నోయెల్ టాటానే టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటాకి నోయెల్ టాటా కుమారుడు. నోయెల్ టాటాకి టాటా గ్రూప్‌తో 40 సంవత్సరాలుగా అనుబంధం వుంది. ఆయన టాటా కంపెనీలోని బోర్డుల్లో రకరకాల హోదాల్లో పని చేశారు.


