TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో మహానేత వై.ఎస్.ఆర్. లేరా?

Published on: Thu May 17, 2012 9:37AM

సిబీఐ దర్యాప్తులో ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి ఇప్పుడు మరో కొత్త సమయ వచ్చింది. జగన్మోహనరెడ్డి ఎప్పుడూ తండ్రి మాట వినలేదనీ, ఆయనంటే గౌరవం లేదనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేపదే విమర్శిస్తున్నారు. జగన్మోహనరెడ్డికి తండ్రి అంటే గౌరవం లేదు కనుకనే పార్టీకి కూడా ఆయన పేరు పెట్టలేదనీ వారంటున్నారు. ఈ వాదన కొంత విచిత్రంగా ఉంది. కానీ, ఎన్నికల కమీషన్ వద్ద నమోదైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పేరు పరిశీలిస్తే ఈ వాదనలో నిజముందని తేలుతోంది.

 

 

నిజానికి రాష్ట్ర ప్రజలందరూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అంటే వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అనే భావిస్తున్నారు. కానీ, ఎన్నికల సంఘం వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ ప్రకారం వై.ఎస్.ఆర్. అంటే యువజన శ్రామిక రైతు (వై.ఎస్.ఆర్.) పార్టీ అని ఉంది. కానీ, ఈ విషయాన్ని జగన్ ఎప్పుడూ ప్రజలకు వివరించడానికి ప్రయత్నించలేదు. ప్రతీ ఎన్నికల సభలోనూ మహానేత వై.ఎస్.ఆర్. పేరిట ఏర్పాటు చేసిన తన పార్టీని ఆదరించాలని జగన్ కోరుకున్నారు. అయితే ఈ పార్టీకి దివంగత వై.ఎస్.ఆర్. కు ఎటువంటి సంబంధంలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జగన్మోహనరెడ్డికి నిజంగా తండ్రిపై ప్రేమ ఉంటే ఆయన పేరునే పార్టీకి పెట్టేవారని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. అయితే వ్యక్తుల పేర్లతో పార్టీలు పెట్టడం సాధ్యం కాదు గనుక యువజన శ్రామిక రైతు (వై.ఎస్.ఆర్.) పార్టీనే పేరు పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలు వివరణ ఇస్తున్నారు.