వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. రద్దీ తగ్గే వరకూ ఇంతే..టీడీడీ కీలక నిర్ణయం
Published on: Sun May 29, 2022 11:05AM
వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. రద్దీ తగ్గే వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవీ తెలిపారు. అధికారులతో కలిసి భక్తుల క్యూలను శనివారం సాయంత్రం తనిఖీ చేసిన ఈవో ఆ తరువాత వీఐపీ దర్శనాల రద్దును ప్రకటించారు.
ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో గంటకు 4,500 మందిని మాత్రమే దర్శనం చేయించగలమని భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు.
వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు వరదలా పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి. ఈ ఉదయం లేపాక్షి మీదుగా అన్నదానం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర క్యూ ఉంది. కాటేజీలు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


