Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నవంబర్ వ్రతం గురించి తెలుసా?
posted on: Nov 8, 2021 9:30AM
అనుకుంటాం కానీ సమాజములో సమస్యల మీద స్పందించే వాళ్ళు బానే ఉన్నారు. అయితే దాన్ని వ్యక్తం చేసే విధానంలో మాత్రం భిన్న కోణాలు తారసపడుతుంటాయి. అలాంటిదే ఈ నవంబర్ నెలలో కూడా ఉందని చెప్పవచ్చు. ఇంతకు విషయం ఏమిటంటే నవంబర్ మొత్తం చాలా వరకు బార్బర్ షాపులకు రాబడి తక్కువ. అలా కాదు ఇంకోలా చెప్పాలంటే నో షేవ్ నవంబర్(no shave november) ప్రస్తుత కాలంలో ఒక ఉద్యమంలాగే తయారయ్యింది. ప్రతి సంవత్సరం దీన్ని ఫాలో అయ్యేవాళ్ళు పెరుగుతున్నారు. కొంతమంది దీన్ని సామాజిక స్పృహ అనుకుని ఫాలో అయితే మరికొంతమంది ఫ్యాషన్, ఆనందం, అన్నిటికి మించి కొత్తదనం, ఇంకా చెప్పాలంటే అదొక కిక్కు లాంటి ఫీల్ కోసం ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఇంతకు ఏమిటీ నో షేవ్ నవంబర్( no shave november)
నో షేవ్ నవంబర్ అనేది నవెంబర్ నెల మొత్తం జుట్టు కత్తిరించకుండా పెరిగే జుట్టును అట్లాగే పెంచేయడం. ఇదే నో షేవ్ నవంబర్ అనే చిన్నపాటి ఉద్యమం లాంటి సామాజిక కార్యక్రమం.
దీని వెనుక కారణం ఏమిటి??
ప్రతి దానికీ కారణం ఉన్నట్టే ఈ నో షేవ్ నవంబర్ వెనుక పెద్ద కారణమే ఉంది. అదే మహమ్మారి కాన్సర్. కాన్సర్ తో బాధపడేవారు ఎదుర్కొనే సమస్యలలో జుట్టురాలిపోవడం ఎంతో మానసిక క్షోభకు గురి చేసే అంశం. కాన్సర్ సోకిన వారి నుండి దాని ట్రిట్మెంట్ మొత్తం పూర్తయ్యేలోపు జుట్టు రాలిపోతుంది. అలాంటి వారు నలుగురి మధ్య తిరగడానికి ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు. అలాంటి వారి కోసం ఒక నెల మొత్తం జుట్టు కత్తిరించకుండా పొడవుగా పెంచి తరువాత దాన్ని కత్తిరించి కాన్సర్ పేషెంట్ ల కోసం వినియోగించడం, అలా కాన్సర్ మీద అవగాహన కూడా కలిగించడం దీని ఉద్దేశ్యం.
ఎక్కడ మొదలయ్యిందిది??
ఈ నో షేవ్ నవంబర్ పుట్టుక ఆస్ట్రేలియా, మరియు న్యూజిలాండ్ దేశాలలో 2004 వ సంవత్సరంలో మొదలయ్యిందని నమోదయ్యి ఉంది. ఏది ఏమైనా కాన్సర్ మీద అవగాహన కోసం, కాన్సర్ తో బాధపడే వారికి తమవంతు సహకారం అందించేందుకు పట్టణ ప్రజలు, ముఖ్యంగా యువత ఈ నో షేవ్ నవంబర్ ను ఫాలో అవుతుంటారు.
ఇదేనా నో షేవ్ నవంబర్ అనిపించవచ్చు. ఇది కేవలం ఇలాగే ఉండలేదు అండోయ్!! ముందు చెప్పుకున్నట్టే ఇదొక ఉద్యమంలా వ్యాప్తమవుతూ సంస్థలు పుట్టుకొచ్చి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ, అటు సామాజిక పరంగా ఇటు మానవీయ విలువల నిర్వహణలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.
నవంబర్ ఏ ఎందుకు??
అనే అనుమానం అందరికి రావచ్చు. బహుశా కాన్సర్ గురించి అవగాహన లేని వాళ్లకు నేషనల్ కేన్సర్ అవేర్నెస్ డే ఎప్పుడో తెలిసి ఉండదు. నవంబర్ 7 ను ప్రతి ఏటా నేషనల్ కేన్సర్ అవెర్నెస్ డే గా జరువుకుంటారు. ఈ అవగాహనా రోజును పురస్కరించుకుని నవంబర్ నెల మొత్తం నో షేవ్ నవంబర్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం దీని ఉద్దేశం కూడా కావచ్చు.
బంగారం లాంటి జుట్టు: నిజమే కదా జుట్టు బంగారమే. ఎవరికి అంటే అది లేనివాళ్లకు. సాదారణంగా మంచి ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారిలో జుట్టు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది. అలాంటివాళ్ళు జుట్టు కెత్తిరించినా మళ్ళీ చాలా తొందరగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి లేనివాళ్లకు ఇవ్వాలంటే గొప్ప మనసు ఉండాలి. అది జుట్టైనా, మరింకేదైనా ఏమంటారు??
కాదంటారా?? అవునంటారా??
అవేమి వద్దు నో షేవ్ నవంబర్ కు ఓటెయ్యండి. అంటే మీరు ఫాలో అయిపోండి. జుట్టు పోతే మళ్ళీ వస్తుంది బాధపడకండి.
◆ వెంకటేష్ పువ్వాడ






