సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు రద్దు!
Published on: Sat Sep 28, 2024 2:05PM

గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం జీవో విడుదల అయ్యింది. రిజిస్ర్టేషన్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాలకు గత ప్రభుత్వం జాయింట్ సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల హోదా కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేసిన గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ ఏడాది ఆగస్టులోనే పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వాటిని రద్దు చేస్తూ జీవో జారీ చేసింది.


