TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం జలాశయానికి నో ప్రాబ్లం.. కన్నయ్యనాయుడు

Published on: Mon Jul 7, 2025 5:10AM

రిటైర్డ్ ఇంజినీర్, ప్రాజెక్టుల గేట్లు నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు శ్రీశైలం జలాశయాన్ని  పరిశీలించారు.    జలాశయం అధికారులతో కలిసి జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని పరిశీలించిన కన్నయ్యనాయుడు   శ్రీశైలం జలాశయం 10వ నంబర్ గేట్ల ద్వారా వచ్చే  నీటి లీకేజీ వల్ల ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.  10 వ గేటు నుంచి నీటి లీకేజీ 10 శాతం కంటే తక్కువగానే ఉందన్నారు.  శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని అధికారులకు సూచించారు.  2010 తర్వాత గేట్లను పెయింటింగ్ వేయలేదని, అలానే జలాశయం ప్రారంభమై 40 సంవత్సరాలు అవుంతోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుందని, ఇదే విధంగా మెయిన్ టెయిన్ చేస్తే..   మరో రెండు దశాబ్దాల వరకూ శ్రీశైలం జలాశయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.  వీలైతే  ఐదేళ్లలో శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలని చెప్పారు.  శ్రీశైలం జలాశయం గేట్ల నిర్వహణకు తగినంత నిధులు ప్రభుత్వం కేటాయిస్తే బాగుంటుందని కన్నయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం జలాశయానికి ప్రమాదం లేదన్నారు. జలాశయం నుండి సుమారు 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్  ఉందని దాని వలన జలాశయానికి ఇబ్బంది లేదని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు.