Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదట!
posted on: Sep 28, 2024 1:34PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని స్పష్టం చేసింది కేంద్రం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అవసరమైతే సెయిల్‌లో విలీనం చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే ఆయనా ప్రకటనే చేసిన స్లల్ప వ్యవధిలోనే విశాఖ స్టీల్ ప్లంట్ యాజమాన్యం ఉద్యోగులపై వేటు వేసింది. విశాఖ స్టీల్ తాజా నిర్ణయంతో దాదాపు నాలుగువేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోనున్నారు. వీరంతా కాంట్రాక్ట్ కార్మికులు కావడం గమనార్హం. స్టీల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దాదాపు నాలుగువేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఐడీలను బయో మెట్రిక్ నుంచి తొలగించారు. కర్మాగారంలో బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే నడుస్తున్నందున కాంట్రాక్టు కార్మికులలో కోత తప్పదని విశాఖ స్టీల్ యాజమాన్యం చెబుతోంది. మరో వైపు ఇప్పటికే పాతిక వందల మంది పర్మనెంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చారు.


.webp)



