TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భీమవరం సభలో రాజుగారికి చోటు లేదు!

Published on: Mon Jul 4, 2022 11:05AM

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో సోమవారం జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని  మోడీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగే సభలో స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చోటు లేదని తేలిపోయింది. ఈ సభలో వేదికపై కూర్చునే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. వారిలో  రఘురామకృష్ణం రాజు పేరు లేదు. ప్రధాని సభలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీకి అవకాశం ఉండాలి.

అయితే అందుకు భిన్నంగా సభలో ప్రధానితో పాటు వేదికపై కూర్చునే ప్రముఖుల పేర్లలో రఘురామకృష్ణం రాజు పేరు లేదు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్న సంగతి విదితమే. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ అనంతరం పెదఅమీరంలో   బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

ఆ సభలో ప్రధాని మోదీ తో పాటు  వేదికపై మరో  11 మంది పేర్లు ఖరారు చేశారు. గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు, అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ, వసుధ ఫౌండేషన్ ప్రతినిధులు, మంతెన వెంకట రామరాజు, పేరిచర్ల రాజు వేదికపై కూర్చోనున్నారు. సభ కోసం దాదాపు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.